Header Banner

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు! సయాటికా సమస్యపై..!

  Sun Feb 23, 2025 07:07        Politics

జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవల హైదరాబాద్‌లోని అపోలో (APOLLO ) ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కొంతకాలంగా సయాటికా (Sciatica) సమస్యతో బాధపడుతున్న ఆయన, వైద్యుల సలహా మేరకు స్కానింగ్ మరియు ఇతర పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు కొన్ని సూచనలు ఇచ్చి, మరికొన్ని పరీక్షలు అవసరమని చెప్పారు. ఈ పరీక్షలు ఈ నెలాఖరులో లేదా మార్చి మొదటి వారంలో చేయనున్నారు.

 

ఇది కూడా చదవండి: దుబాయిలో ప్రవాసి కేంద్రాన్ని సందర్శించిన అనిల్ ఈరవత్రి! ఎందుకంటే!

 

ఆరోగ్యం మెరుగుపడాలని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవల కేరళ (kerala) ,  తమిళనాడు (Tamilnadu) లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను దర్శించారు. అనంతరం ప్రయాగరాజ్ వెళ్లి పుణ్యస్నానం కూడా చేశారు. అయితే, ఆయన ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవడం అభిమానుల్లో కొంత ఆందోళన కలిగించింది. కానీ, జనసేన కార్యాలయం ప్రకారం, ఆయన ఆరోగ్యం సరిగానే ఉందని, త్వరలో పూర్తి ఆరోగ్యంతో తిరిగి విధుల్లో చేరుతారని తెలిపారు.

ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని పార్టీ కార్యాలయం ప్రకటించింది. కానీ, వైద్యుల సూచనల ప్రకారం, ఆరోగ్యం ఆధారంగా ఆయన భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తారు. ఈ సమయంలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Andhrapradesh #Deputycm #pawankalyan #apollo #pawankalyanhealth